![]() |
![]() |

డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల అందరికీ తెలుసు. కార్తీక దీపం సీరియల్ ద్వారా ఆయన ఎంతో ఫేమస్. డాక్టర్ బాబు, వంటలక్క క్యారెక్టర్స్ తో ఈ సీరియల్ ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సీరియల్ కి శుభం కార్డు పడబోతోంది. ఈ టైములో నిరుపమ్ తన సీరియల్ టీమ్ తో కలిసి అనంతపురంని విజిట్ చేసాడు. అక్కడ టీడీపీ లీడర్ పరిటాల శ్రీరామ్ ని కలిసి ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. పరిటాల శ్రీరామ్ రియల్ హీరో అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. వాస్తవానికి ఇద్దరి ఇంటిపేరు పరిటాల కావడంతో బంధువులు అని అంతా అనుకునేవారు. కానీ.. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఓ ఇంటర్వ్యూలో నిరుపమ్ క్లారిటీ ఇచ్చాడు.
సోషల్ మీడియాలో నిరుపమ్ పరిటాల చాలా యాక్టివ్ గా ఉంటాడు. కార్తీకదీపం టీమ్‌తో కలిసి రెగ్యులర్ గా రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటాడు. నిరుపమ్ వైఫ్ మంజుల కూడా సీరియల్ యాక్టర్. కర్నాటకకి చెందిన మంజుల తొలుత కన్నడలో సీరియల్స్ చేసి..తర్వాత తెలుగులో చంద్రముఖి సీరియల్ ద్వారా పరిచయమయ్యింది. నిరుపమ్‌ని ఫస్ట్ టైమ్ చూసినప్పుడు.. ఇంతకంటే మంచి హీరో దొరకలేదా మీకు? అని అడిగేసిందట. అప్పట్లో సన్నగా, గుండుతో ఉన్న నిరుపమ్ ని ఫస్ట్ టైమ్ అలా చూసేసరికి మంజుల అలా అనేసిందట. ఆ తర్వాత అదే సీరియల్‌లో ఇద్దరూ ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్నారు. నిరుపమ్ హిట్లర్ గారి పెళ్లాం, ప్రేమ, కలవారి కోడలు, కాంచన గంగ వంటి సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
![]() |
![]() |